కంటి చూపును మెరుగుపరిచే ఆరోగ్య ప్రదాయని ఉసిరి..

0
44

ప్రకృతి ప్రసాదించిన కాయల్లో ఉసిరిక్కాయ ఒకటి. ఇది వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనితోపాటు ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పచ్చడి, జ్యూస్, క్యాండీ, మురబ్బా ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి మంచిది. ఉసిరి కాయలు నేరుగా కూడా తినవచ్చు.

ఇందులో ఉన్న పీచు పదార్ధం మలబద్ధకాన్ని నివారిస్తుంది. రోజువారీ ఆహారంలో ఉసిరి ఉండేలా చూసుకుంటే బరువు తగ్గడంతో పాటు జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.

ఉసిరి రసం రోజూ తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గి, గుండె పనితీరు మెరుగు పడుతుంది. తరచూ ఉసిరిని ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు చర్మానికి మంచి మెరుపు వస్తుంది.

కంటి చూపు మెరుగు పడుతుంది. రోగనిరోధక శక్తి పెంచడంతో పాటు బడ్ల్ షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. ఆర్థరైటిస్ వంటి కీళ్ల నొప్పుల నివారణకు ఎండు ఉసిరి ఉపయోగపడుతుంది.