ఓ దర్శకుడు ఇచ్చిన చిన్నపాటి సలహాతో మెగా ఫ్యామిలీకి చెందిన హీరో ఫేట్ మారిపోయింది. ఆ హీరో ఎవరో కాదు సాయి ధరమ్ తేజ్. ఈయన న్యూమరాలజీ (సంఖ్యాశాస్త్రం) ప్రకారం తన పేరును సాయితేజ్‌గా మార్చుకున్నాడు.
వరుస పరాజయాలతో సాయిధరమ్ తేజ్ సతమతమైపోతుంటే ఆయనకి ఈ సలహాను ఇచ్చింది దర్శకుడు మారుతినట. సాయితేజ్‌గా పేరు మార్చుకున్నాక ఆయన చేసిన ‘చిత్రలహరి’కి మంచి స్పందన వచ్చింది. దాంతో ఇక నుంచి సాయితేజ్ పేరుతోనే కొనసాగాలని ఆయన ఫిక్స్ అయ్యాడట.
ఈ నేపథ్యంలో సాయితేజ్ తదుపరి సినిమా ఎవరి దర్శకత్వంలో ఉండనుందా అనే ఆసక్తి అందరిలోనూ తలెత్తింది. మారుతి దర్శకత్వంలోనే ఆయన సినిమా ఉండనుందనేది తాజా సమాచారం. ‘శైలజా రెడ్డి అల్లుడు’ తర్వాత మారుతి ఒక మంచి కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ కథను సాయితేజ్‌తో చేయాలని ఆయన నిర్ణయించుకున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా ఉండనుందని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని అంటున్నారు.