మారుతి దర్శకత్వం లో మెగా హీరో

0
37

సినిమా ఇండస్ట్రీ లో ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఫస్ట్ సినిమా లాంచ్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎవరికివారు కష్టపడి గుర్తింపు తెచ్చుకోవాల్సిందే. మెగా ఫామిలీ లో సాయి ధరమ్ తేజ్ కూడా ఫామిలీ సపోర్ట్ తో వచ్చినవాడే. మొదట్లో తన నటన, డాన్సులు ద్వారా జనాల్ని ఆకట్టుకున్నా కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ లో సరైన నిర్ణయాలు తీసుకోకపోడవం తో అతని సినిమా లు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణం గా బోల్తా కొట్టాయి.

ఐతే తాజా సమాచారం ఏంటి అంటే.. గీతా 2 మరియు యూవీ క్రియేషన్స్ వారు కలిసి ఓ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కి మారుతి దర్శకుడు. నిజానికి మారుతి నానితో ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ నాని కి ఉన్న వేరే కమిట్మెంట్స్ వలన వీళ్ళ కామిబినేషన్ లో సినిమా కుదరలేదు. దాంతో తేజుతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి మారుతి ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వం లో ‘చిత్రలహరి’ చేస్తున్నాడు. మరి ఈ ఏడాదన్నా తేజ్ హిట్లు కొడతాడా లేదో చూడాలి మరి.