లింగమార్పిడి పాత్రలో ఆదాశర్మ.. డేరింగ్ రోల్..

0
46

హీరోయిన్ ఆదా శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పదకొండేళ్ళ క్రితమే సినీరంగ ప్రవేశం చేసిన అదా శర్మ.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో గ్లామరస్ రోల్స్ మాత్రమే చేసింది. పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో చాలా తక్కువగా నటించింది. తెలుగులో సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ అమ్మడు చేస్తున్న వివిధ రకాల ఫీట్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.

ఇదిలావుంటే బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మక చిత్రాల హవా కొనసాగుతోంది. మొన్నామధ్య వీర్యదానం కాన్సెప్ట్‌పై ‘విక్కీ డోనర్’ సినిమా జనాదరణ పొందగా ఇటీవల లెస్బియన్ కథాంశంతో ‘ఏక్ లడకీకో దేఖాతో ఐసా లగా’ సినిమా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు ఏకంగా లింగమార్పిడి కథాంశంతోనే ఒక మూవీ తెరకెక్కుతోంది. ఆ సినిమా పేరు ‘మ్యాన్ టు మ్యాన్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను ‘హార్ట్ ఎటాక్’ బ్యూటీ అదా శర్మ పోషిస్తూండడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ‘మ్యాన్ టు మ్యాన్’ చిత్రంతో తన కెరీర్‌లోనే తొలిసారిగా ఛాలెంజింగ్ రోల్ చేస్తూండడం బాలీవుడ్‌లో చర్చకు దారితీసింది. అవుటాఫ్ ది బాక్స్ కాన్సెప్ట్‌తో ఇలా డేరింగ్ స్టెప్స్ వేస్తోన్న అదాశర్మ.. ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుందట.

పుట్టుకతో అబ్బాయి అయిన అదా శర్మ పాత్ర.. లింగమార్పిడి ఆపరేషన్ ద్వారా అమ్మాయిగా మారుతుందట. కానీ ఈ విషయం తెలియని హీరో నవీన్ కస్తూరియా అదాను పెళ్ళి చేసుకుంటాడట. పెళ్ళయిన తర్వాత ఆమె కథ తెలుసుకున్న భర్త అవాక్కవుతాడట. లింగమార్పిడిపై మన సమాజంలో ఉన్న చిన్నచూపు.. అలాంటి శస్త్రచికిత్స ద్వారా మారిన వ్యక్తులు ఎదుర్కొనే ఇబ్బందులను వివహిస్తూ ఈ చిత్రం వినోదాత్మకంగా సాగనుంది.