తెలంగాణ గడ్డపై ప్రతిపక్షాలు అక్కర్లేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి

0
41

తెలంగాణ గడ్డపై ప్రతిపక్షాలు అనే మాట లేకుండా చేయాలని సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ అన్యాయంగా, అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు అఖిలపక్షం ఫిర్యాదు చేసింది.

అనంతరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పార్టీ అధ్యక్షుడి అనుమతి లేకుండా సీఎల్పీ కౌన్సిల్‌ను విలీనం చేయడానికి వీల్లేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తీసుకునేందుకు సభాపతి ముందుకు రావట్లేదని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీని విలీనం చేసినట్టుగా చేసి, ఎంఐఎంను ప్రతిపక్ష పార్టీగా చూపాలని టీఆర్ఎస్ యత్నిస్తోందని అన్నారు. తెలంగాణలో అసలు ప్రతిపక్షాలు బతకాలా? వద్దా? అని ప్రశ్నించిన ఉత్తమ్, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ కలిసి పని చేయాలని కోరారు.