ఒంటరైన కిమ్ శర్మ.. కుర్ర ప్రేమికుడితో కటీఫ్

0
34

“ముసుగు వేయొద్దు మనసు మీదా.. వలలు వేయొద్దు వయసు మీదా” అంటూ తన సెక్సీ చూపులతో కుర్రకారు గుండెల్లో గునపాలు గుచ్చిన హీరోయిన్ కిమ్ శర్మ. “ఖడ్గం” చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఈ అమ్మడు గత కొన్ని రోజులుగా కెమరా కంటికి చిక్కడం లేదు. దీంతో మీడియా బాలీవుడ్ వర్గాల వద్ద ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

బాలీవుడ్ హీరో హర్షవర్ధన్ రాణేతో ఈ అమ్మడు ప్రేమాయణం నడుపుతూనే అటు బాలీవుడ్, ఇటు తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అయితే, రెండు భాషల్లో ఆమెకు సరైన సక్సెస్ లభించలేదు. దీంతో రెండేళ్ల కిందట రాణే మనసును దోచుకుంది. ఇదే అదునుగా భావించిన హర్షవర్ణన్.. కిమ్‌తో కామ్‌గా సరసాలు మొదలెట్టాడు.

డేటింగ్ జోరందుకోటంతో మీడియాలో గుప్పుమంది. అయితే, కిమ్, హర్షవర్ధన్ మొహమాటం లేకుండా తాము ప్రేమలో మునిగినట్టు తేల్చి చెప్పేశారు. నీటి బుడగల్లాంటి గ్లామర్ ప్రపంచంలోని ఎఫైర్లు పగిలిపోకుండా ఉంటాయా? కిమ్, హర్షవర్ధన్ రొమాన్స్ కూడా ది ఎండ్‌కు చేరుకుందట.

ఇపుడు వారిద్దరూ విడిపోయారని హర్షవర్ధన్ రాణే స్వయంగా ప్రకటించారు. అయితే, కిమ్ మాత్రం దీనిపై ఇంకా స్పందించలేదు. కొన్నాళ్ల కిందట వీరిద్దరూ గొడవపడి మాట్లాడుకోవటం మానేశారని అంటున్నారు. ఇక లాభం లేదనుకున్న మాజీ ప్రేమికులు బైబై చెప్పేసుకున్నారట.

సెక్సీ బ్యూటీ కిమ్ గతంలో కెన్యా దేశంలోని ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లాడింది. విడాకులు తీసుకుని హర్షవర్ధన్‌తో మరో ఇన్నింగ్స్ సాగించింది. చూడాలి మరి తాజా బ్రేకప్ తర్వాత మన గ్లామర్ డాల్ ఎంత కాలం ఒంటరిగా ఉండగలుగుతుందో.