దానిమ్మ జ్యూస్‌తో నిత్యయవ్వనం మీసొంతం..

0
50

అన్ని కాలాల్లో విరివిగా లభించే పండ్లలో దానిమ్మ పండ్లు ఒకటి. వీటిని ఇష్టపడనివారుండరు. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు దానిమ్మలో అనేకం ఉన్నాయి. ఆరోగ్యవంతులు, అనారోగ్యవంతులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆరగించవచ్చు.

* ఎరుపు రంగులో ఉండే దానిమ్మ పండులో ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయి. అనేక పోష‌కాల‌ు దానిమ్మ పండ్లలో ఉన్నాయని చెప్ప‌వచ్చు.

* దానిమ్మను రోజూ తినడం వల్ల ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు క‌రిగిపోతుంది. గుండెకు ర‌క్తం బాగా స‌ర‌ఫ‌రా అవుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఈ పండ్ల‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.

* దానిమ్మలో ఫైబ‌ర్‌, ఫొలేట్‌, పొటాషియం, మెగ్నీషియం, విట‌మిన్ సి, కె, త‌దితర పోష‌కాలు పుష్క‌లంగా ఉంటాయి. అందువల్ల దానిమ్మ పండ్ల‌ను రోజూ తినడం వలన ఎన్నో లాభాలు క‌లుగుతాయి. అనారోగ్య స‌మస్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు.

* దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ట్యూమ‌ర్ గుణాలు క్యాన్స‌ర్లు రాకుండా చేస్తాయి. దానిమ్మలోని ప్యూనిసిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్స‌ర్ క‌ణాల‌ను నాశ‌నం చేస్తుంది. దీంతో బ్రెస్ట్ క్యాన్స‌ర్, ప్రోస్టేట్ క్యాన్స‌ర్ రాకుండా త‌ప్పించుకోవ‌చ్చు.

* కీళ్ల దగ్గర వాపులు వస్తే కీళ్ల నొప్పులు వస్తాయి. నొప్పిని తగ్గంచి, సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్యం దానిమ్మ పండును తినాలి, లేదా జ్యూస్ తాగాలి. హైబీపీ ఉన్న‌వారు దానిమ్మ పండు జ్యూస్‌ను తాగాలి.

* దానిమ్మ జ్యూస్ తాగ‌డం వ‌ల్ల బాక్టీరియా, వైర‌ల్‌, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. నిత్యం వ్యాయమం చేసే వారికి దానిమ్మ జ్యూస్ మంచి శక్తినిస్తుంది. కోల్పోయిన శ‌క్తిని తిరిగి ఇవ్వ‌డంతో పాటు పోష‌కాల‌ను కూడా అందిస్తుంది.