హీరోయిన్గా నిలదొక్కుకోలేక పోయిన… గ్లామర్ లేదా ఐటమ్ గర్ల్‌గా సౌత్‌లో తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్న భామ లక్ష్మీరాయ్ అలియాస్ రాయ్ లక్ష్మీ. మెగాస్టార్ చిరంజీవి సరసన ‘రత్తాలు.. రత్తాలు’ అంటూ మాస్ స్టెప్స్ వేసి.. తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈమె హీరోయిన్గా కంటే.. ఐటమ్ గర్ల్‌గా మంచి పాపులర్ అయింది. అలా ఎందుకు అయిందన్న విషయంపై ఆమె తాజాగా క్లారిటీ ఇచ్చింది.
తెలుగులో హీరోయిన్ పాత్రలకన్నా స్పెషల్ సాంగ్స్‌కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారెందుకన్న ప్రశ్నకు లక్ష్మీరాయ్ బదులిస్తూ, సినిమాలో తెర మీద రెండున్నర గంటల పాటు కనిపించినా, రాని పేరు ఒక్క పాట చేస్తే వస్తోంది. నాకు ప్రేక్షకుల్లో గుర్తింపు ముఖ్యం. నేను చేసిన పాటలు నాకు మంచి పేరును తెస్తున్నాయి. దక్షిణాదిలో ఐటెంసాంగ్స్ అంటే కొద్దిగా చిన్న చూపు చూస్తారు కానీ, ఉత్తరాదిన స్టార్ హీరోయిన్లు కూడా కావాలని ఇలాంటి పాటలు చేస్తుంటారు. అందుకే తాను ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ వైపే మొగ్గుచూపుతుంటాను అని చెప్పుకొచ్చింది.