తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం లింగా. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించింది. ఈమె ఒకప్పుడు బొద్దుగుమ్మగా ఉంటే.. ఇపుడు ముద్దుగుమ్మగా మారిపోయింది. అంటే బరువు తగ్గి స్లిమ్‌గా తయారైంది మాత్రం సినిమాల కోసం కాదని చెబుతుందీ భామ. మరి ఆ ముచ్చటేంటో ఆమె మాటల్లోనే..
‘ట్రెడ్‌మిల్‌పై నలభై సెకన్ల కన్నా ఎక్కువ సేపు ఉండలేకపోయాను. దానికి కారణం నా బరువే! అప్పుడే అనిపించింది. బరువు తగ్గకపోతే లాభం లేదని. చాలా మంది నేను సినిమాల కోసమే బరువు తగ్గానని అనుకున్నారు కానీ, నా ఆరోగ్యం గురించే బరువు తగ్గాను. తగ్గిన బరువును అలాగే మెయిన్‌టెయిన్ చేస్తున్నాను. బరువు పెరగకుండా ప్రతిరోజూ వ్యాయామంతో పాటు యోగా కూడా చేస్తుంటాను. యోగా మొదలెట్టినప్పటి నుంచి మానసికంగా, శారీరకంగా మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఎంతైనా ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే అన్నది అలనాటి కవుల సామెత.