ఒత్తిడిలో ఆహారం తింటున్నారా?

0
85

నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో ఎవరినీ చూసినా నిత్యం అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అనేక సంద‌ర్భాల్లో తీవ్ర‌ ఒత్తిడికి లోనవుతున్నారు. దీన్నే మనం స్ట్రెస్ అని కూడా అంటుంటాం. వేగంగా మారుతున్న నేటి సామాజిక ప్రభావం వల్ల ఈ ఒత్తిడి లేని వారు రాని వారు లేరంటే అతిశయోక్తి లేదు.

అయితే, ఈ ఒత్తిడి వల్ల బరువు పెరుగుతారని తేలింది. ముఖ్యంగా, అధిక కేలరీలు గల ఆహారం తీసుకుంటే.. చెడు కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగిపోతారు. అదే ఆహారాన్ని ఒత్తిడిలో ఉన్నప్పుడు తీసుకుంటే మరింత ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

న్యూ సౌత్‌ వేల్స్‌లోని గార్వాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ పరిశోధకులు ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని గుర్తించారు. ఒత్తిడి ఉన్న సమయంలో అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటే చక్కెర, ఇన్సులిన్‌ స్థాయిలు 10 రెట్లు అధికంగా పెరిగిపోతాయని పరిశోధకులు వెల్లడించారు.