భారత్ వల్ల అమెరికాకు నష్టం.. ట్రంప్ అక్కసు

0
81

భారత్ వంటి దేశాలతో అమెరికాకు నష్టం వాటిల్లుతోందని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు వేస్తోందంటూ ఆయన తనలోని అక్కసును వెళ్లగక్కారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, పన్నులు వేయడంలో భారత్ మొదటి స్థానంలో ఉందన్నారు. భారత్, చైనా, జపాన్ వంటి దేశాలు అధిక పన్నులు వేయడం వల్ల అమెరికాకు లక్షల డాలర్ల నష్టం వస్తోందని ఆగ్రహించారు.

ఈ వైఖరిని మార్చుకోకపోతే.. భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై తాము కూడా పన్నులు వేస్తామని హెచ్చరించారు. కాగా, ఇటీవలి కాలంలో భారత్‌పై అక్కసును వెళ్లగక్కడంలో ట్రంప్ ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. చాలా విషయాల్లో అమెరికాను భారత్ మించిపోతోంది. దీన్ని ఆయన జీర్ణించుకోలేక ఈ తరహాలో అక్కసును వెళ్లగక్కుతున్నారు.