సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగా… క్లారిటీ ఇచ్చిన తార సుతారియా

0
61

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హీరోయిన్లలో సుతారియా ఒకరు. ఈమె ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’లో సహ నటుడు సిద్దార్థ్ మల్హోత్రాతో జతకట్టింది. పైగా, ఈ చిత్రం షూటింగ్ సమయంలో వీరిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్నారు. దీంతో ఖచ్చితంగా వీరిద్దరి మధ్య ఏదో డీల్ ఉదనే రూమర్స్ వచ్చాయి. అదేసమయంలో డేటింగ్‌లో మునిగితేలుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది.

దీనిపై సుతారియా క్లారిటీ ఇచ్చింది. తాజాగా, ఒక రేడియో షో లోను, కరణ్ జోహార్ ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాం లోను ఈ ర్యూమర్స్‌కి సమాధానం చెప్పింది. సిద్దార్థ్ మల్హోత్రా తన ఇంటి దగ్గర్లోనే ఉంటాడని, ఇద్దరు స్నేహితులని, తమ మధ్య అంతకుమించి మరో కెమిస్ట్రీ లేదని తేల్చిపారేసింది. పైగా, డేటింగ్‌ చేసేందుకు సమయం చాలావుందని ఆమె చెప్పుకొచ్చింది.