ఆనందంగా ఉన్నప్పుడు నృత్యం చేస్తా : మిల్కీ బ్యూటీ

0
62

టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆకలిగా ఉన్న సమయంలో నృత్యం చేస్తానంటూ చెప్పుకొచ్చింది. పైగా, నృత్యం అనేది తనలో నరనరాన దాగివుందని తెలిపింది. ఇంతకీ ఈ తెల్లపిల్ల ఇలా వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.

అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని సోమవారం జరుపుకున్నారు. దీన్ని పురస్కరించుకుని తమన్నా ఓ ట్వీట్ చేసింది. ‘ఇవాళ అంతర్జాతీయ నృత్య దినోత్సవం. నాకు నృత్యం అంటే ఎంత ఇష్టమో నేను గట్టిగా ఎప్పుడూ చెప్పలేదు. నేను ఆనందంగా ఉన్నప్పుడు నృత్యం చేస్తా. నేను ఎవరికోసమైనా వేచి చూస్తున్నప్పుడూ నృత్యం చేస్తా. చెప్తే, నవ్వుతారేమోగానీ, నేను ఆకలితో ఉన్నప్పుడు కూడా నృత్యం చేస్తా. నా మనసును ఆవిష్కరించే అద్భుతమైన భాష నృత్యం. అది నాలో నరనరాన దాగి ఉంది’ అని వివరించింది.

పైగా, ‘అందులో మనకు ప్రావీణ్యం ఉందా? లేదా? అనేది కాదు. మనల్ని మనం వ్యక్తం చేసుకోవడానికి ఉపయోగపడిందా? లేదా? అనేదే లెక్క’ అంటూ వేదాంత ధోరణిలో ఆమె పలుకులు ఉన్నాయి. కాగా, ‘బాహుబలి’ తర్వాత ఆమె ఖాతాలో “ఎఫ్ 2” రూపంలో సూపర్ హిట్ మూవీ చేరిన విషయం తెల్సిందే.