సమంత కన్ఫార్మ్… మన్మథుడు 2 షూటింగ్‌లో జాయిన్

0
37

మన్మథుడు సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జున జిమ్ ఫోటోలు వైరల్ అయ్యాయి. కింగ్ నాగార్జున కథానాయకుడిగా గతంలో వచ్చిన ‘మన్మథుడు’ భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘మన్మథుడు 2’ రూపొందుతోంది. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ‘పోర్చుగల్’లో జరుగుతోంది.

రకుల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, సమంత ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను నిజం చేస్తూ మన్మథుడు 2 సినిమా షూటింగులో సమంత జాయినైంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సినిమాకి, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

Samantha Akkineni
Samantha Akkineni