శ్రీలంకలో ముస్లిం మహిళలు బుర్ఖాలు ధరించడంపై నిషేధం విధించారు. అలాగే, కేరళ రాష్ట్రంలోని ఒక ముస్లిం విద్యా సంస్థ (ఎంఈఎస్) సంస్కరణ దృక్పథంతో కూడిన నిర్ణయం తీసుకుంది. కోళికోడ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ సొసైటీ తమ విద్యా సంస్థల పరిధిలో ముస్లిం విద్యార్థినుల బుర్ఖా (బురఖా) ధరించడంపై నిషేధం విధించింది.
ఈ నిర్ణయం 2019-20 విద్యా సం వత్సరం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఫజల్ గఫూర్ గత నెల 19న రాష్ట్రంలోని తమ విద్యాసంస్థల అధిపతులకు సర్క్యులర్ జారీచేశారు. సదరు సర్క్యులర్‌లో నేరుగా బురఖా వాడొద్దని పేర్కొనలేదు.
కేరళలో ఇస్లాం మతాన్ని పాటించాలే కానీ, మద్యప్రాచ్యంలోని ఇస్లాం పద్దతులను కాదని డాక్టర్ ఫజల్ గఫూర్ వివరించారు. విద్యార్థులతోపాటు బోధనా సిబ్బంది కూడా ఈ నిబంధనను తప్పక పాటించాల్సిందేనన్నారు.
కాగా, శ్రీలంకలో ఈస్టర్ సండే సందర్భంగా జరిగిన వరుస బాంబు పేలుళ్ల తర్వాత ఆ దేశ ప్రభుత్వం గత నెల 21న ముస్లిం మహిళల బురఖా వినియోగాన్ని నిషేధించిందని, కానీ తాము అంతకు ముందే నిషేధం విధించామని ఆయన గుర్తుచేశారు.