భారత మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్‌ను భారత మాజీ పేసర్ శ్రీశాంత బహిరంగంగా దూషించిన మాట నిజమేనని భారత క్రికెట్ జట్టు మానసిక వైద్య విభాగం మాజీ కోచ్ పాడీ ఆప్టన్ వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన తన పుస్తకం ‘బేర్‌ఫుట్ కోచ్’లో వెల్లడించాడు.
‘శ్రీశాంత్ ప్రవర్తన సరిగా ఉండేది కాదు. జట్టునుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించడానికి అతడి ప్రవర్తన కూడా కారణం. ముంబైతో మ్యాచ్‌కు అతడిని తప్పిస్తున్నట్టు శ్రీశాంత్‌కు చెప్పాం. దాంతో అతడు ద్రావిడ్‌ను, నన్ను అందరిముందే నిందించాడు’ అని ఆప్టన్ పేర్కొన్నాడు. 2013 ఐపీఎల్ స్పాట్‌ఫిక్సింగ్ కుంభకోణంలో శ్రీశాంత్ అరెస్టు కావడానికి 24 గంటల ముందు ఈ సంఘటన జరిగినట్టు ఆయన వివరించాడు.