ఛీ.. ఛీ.. ఇదేం సినిమా… పబ్లిక్‌గా రోడ్డుపై శృంగారం చేస్తామా: జీవితా రాజశేఖర్

0
90

న‌ర‌సింహ నంది ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిగ్రీ కాలేజ్’. ఈ సినిమా ట్రైల‌ర్ ఇటీవల విడుదలైంది. దీన్ని ముఖ్య అతిథిగా వ‌చ్చిన నటి జీవితా రాజ‌శేఖ‌ర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ట్రైలర్‌ను చూసిన ఆమె దర్శకనిర్మాతపై మండిపడ్డారు. ఇందులో అడ‌ల్ట్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంద‌ని.. స‌మాజంపై బాధ్య‌త‌తో ఆలోచించి సినిమాలు తీయాల‌ని సలహా ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సినిమా తీయ‌డ‌మ‌నేది చాలా క‌ష్ట‌మైన ప‌ని. సినిమా తీయ‌డ‌మెంత క‌ష్ట‌మో.. దాన్ని రిలీజ్ చేయ‌డం ఇంకా క‌ష్టంగా మారిందన్నారు. ‘డిగ్రీ కాలేజ్’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి రాంగ్ ప‌ర్స‌న్‌గా న‌న్ను పిలిచార‌నుకుంటున్నాను. నేను సెంట్ర‌ల్ సెన్సార్‌బోర్డు మెంబ‌ర్‌ని. ఈ సినిమా ట్రైల‌ర్ ఇంకా సెన్సార్ కాలేద‌నే అనుకుంటున్నాను.

ఆర్.ఎక్స్ 100, అర్జున్ రెడ్డి పుణ్యమా అని, తెలుగు సినిమాలు ఈ మ‌ధ్య లిప్ లాక్ సీన్స్ లేకుండా రావ‌డం లేదు. కాలేజ్ స్టూడెంట్స్ అంటే మేక్ అవుట్స్ లేకుండా, లిప్ లాక్స్ లేకుండా సినిమాలు తీయ‌కూడ‌దు అనే ప‌రిస్థితికి తెలుగు సినిమా దిగ‌జారిపోయింద‌నుకుంటున్నాను. నేను చూసిన ట్రైల‌ర్‌లో నాలుగైదు షాట్స్ లిప్‌లాక్సే ఉన్నాయి. అలాగే పోస్ట‌ర్‌లో కూడా అదే ఉందని చెప్పుకొచ్చారు.

ఇకపోతే, మ‌నం ఏదైనా ఇల్లు క‌ట్టుకుంటే బాత్‌రూమ్‌లోనే స్నానం చేస్తాం. బెడ్‌రూంలోనే ప‌డుకుంటాం. హాల్లో వ‌చ్చి స్నానం చేయం. ప్ర‌తి మ‌నిషి జీవితంలో శృంగారం ఉంటుంది. ఉన్నంత మాత్రాన అది ఎక్క‌డ చేయాలో అక్క‌డే చేస్తే బావుంటుంది. ప‌బ్లిక్‌గా రోడ్డుపై చేస్తే అస‌హ్యంగా ఉంటుందన్నారు.

ఇపుడు లిప్ లాక్ అనేది సినిమాల్లో ముఖ్యమైపోయింది. అలాగే బ‌ట్ట‌లిప్పుకోవ‌డం.. అమ్మాయిలు అబ్బాయిల మీదెక్కి కూర్చోవ‌డం, అబ్బాయిలు అమ్మాయిల మీదెక్కి కూర్చోవ‌డం కామ‌న్‌గా క‌న‌ప‌డుతున్నాయి. అంటే ఈ విష‌యాలు ఇది మీ జీవితంలో లేదా? అనొచ్చు. ఉన్నాయి. కానీ రోడ్డు మీద చేయ‌లేం క‌దా. ఇలా ఎందుకు చేయ‌కూడ‌దు? ఎందుకు సెన్సార్ ఇవ్వ‌రు? అని అడ్డంగా వాదించే డైరెక్ట‌ర్స్‌తో మ‌నం వాదించ‌లేమని జీవితా రాజశేఖర్ అన్నారు.