సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం కామన్. నేటి ట్రెండ్‌లో పెళ్లికి ముందే ఈ తరహా సంబంధాలు అధికంగా ఉన్నాయి. పలువురు కుర్రకారు హీరో, హీరోయిన్లు సహజీవనం పేరుతో డేటింగ్‌లు కూడా చేస్తున్నారు.
కానీ, పెళ్లి తర్వాత వీరి ఆటలకు ఫుల్‌స్టాఫ్ పడుతుంది. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్ళి తర్వాత బుద్ధిగా ఉంటారు. ఇదంతా సర్వసాధారణమే. కానీ పెళ్ళయిన తర్వాత కూడా తన ప్రేమాయణాన్ని కొనసాగించిన ఓ రసికరాజు బాలీవుడ్‌లో ఉన్నారు. ఆయన ఎవరో కాదు సీనియర్ హీరో శత్రుఘ్న సిన్హా.
ఈ విషయాన్ని ఆయన భార్యే పూనమ్ సిన్హా బహిర్గతం చేసింది. ఓ షోలో తన భర్త గురించిన వివరాలు చెబుతూ, తమ పెళ్ళయిన తర్వాత కూడా ఏడేళ్ల పాటు బాలీవుడ్‌లో ఓ నటితో తన భర్త ప్రేమాయణం సాగించారనీ, ఆ సంగతి తనకు తెలిసినా, వారి సంబంధానికి తానేమీ అడ్డు చెప్పలేదంటూ తన గొప్ప మనసును ఆవిడ చాటుకున్నారు.