ఫేస్బుక్ సంస్థ తమ యూజర్స్ కి మరో కొత్త ఫీచర్ ని పరిచయం చేయబోతుంది. అదేంటంటే..ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా మనం ఎవరికైనా మెసేజ్ పంపించిన తర్వాత 10 నిమిషాలు సమయం లోపు.. మనం పంపించిన మెసేజ్ ని కావాలంటే డిలీట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తుంది.
కొన్నిరోజుల క్రితం వాట్సాప్ కూడా ఈ ‘డిలీట్’ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏదైనా మెసేజ్‌ను సెలక్ట్ చేసుకుని డిలీట్ బటన్ నొక్కగానే ‘డిలీట్ ఫర్ మి’,లేదా ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫేస్బుక్ ప్రవేశపెట్టే ఈ ‘డిలీట్ ఫర్ ఎవ్రీవన్’ ఆప్షన్ కి మంచి రెస్పాన్స్ వస్తది.