తెలుగు చిత్ర పరిశ్రమలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ తాప్సీ. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఈ బామ్మను టాలీవుడ్‌కు పరిచయం చేయగా, చివరకు ఆయనపైనే విమర్శలు ఎక్కుపెట్టి ఆగ్రహానికి గురైంది.
ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసి అక్కడ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. మంచి ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో నటిస్తూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. గతేడాదిలో ఆమె విక్కీ కౌశల్‌తో కలిసి నటించిన ‘మన్మర్జియాన్’ సినిమా మంచి సక్సెస్ అయింది.
తాజాగా ఈ జంట కలిసి ఓ టీవీ షోలో పాల్గొంది. ‘మన్మర్జియాన్’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత చిత్రబృందం ఓ పార్టీ చేసుకున్నారట.
ఆ పార్టీలో ఫుల్లుగా మద్యం సేవించినట్లు తాప్సీ స్వయంగా చెప్పుకొచ్చింది. విక్కీ కూడా తనతో కలిసి బాగా తాగినట్లు చెప్పింది. ఆ తర్వాత అక్కడే పడుకోవాలనుకున్నట్లు ఆ హోటల్ తనకు అంత బాగా నచ్చిందని చెప్పుకొచ్చింది.
ఇంతలో కల్పించుకున్న విక్కీ ”మేము స్టే చేసిన హోటల్లో ప్రతి రోజు డిన్నర్ అయిన తర్వాత గార్డెన్లో నడుచుకుంటూ వెళ్తూ రిలాక్స్ అయ్యేవాళ్లం.. ఆ రోజు పార్టీ ముగిసిన తర్వాత తాప్సీ అక్కడే ఉందామని పట్టుబట్టింది. ఆమెకు ఆ ప్లేస్ అంతగా నచ్చింది. నేను ఎంత కన్విన్స్ చేసినా వినలేదు” అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తాప్సీ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.