తాతయ్య కాదు.. కామాంధుడు.. మనవరాలిపై అత్యాచారం.. గర్భవతి కావడంతో?

0
33
child And Grand Father
child And Grand Father

కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. వావివరుసలు లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ తాతయ్య మనవరాలిపై అత్యాచారానికి పాల్పడిన దుర్ఘటన హైదరాబాదులోనే చోటుచేసుకుంది.

వరుసకు మనవరాలైన బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకుని గర్భవతిని చేయడంతో ఆమె మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ మీర్‌పేట్‌లోని ప్రశాంత్‌నగర్‌కు చెందిన మొగలయ్యకు ముగ్గురు కుమార్తెలున్నారు. 2008లో భార్య చనిపోవడంతో మిర్యాలగూడకు చెందిన దుర్గమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు.

దీంతో దుర్గమ్మ మేనమామ మల్లేశ్, మొగలయ్య ఇంటికి వచ్చి పోయే క్రమంలో ఆయన రెండో కుమార్తె(17)కు మాయమాటలు చెప్పి లోబరుచుకుని బాలికను గర్భవతిని చేశాడు. దీంతో స్థానిక పెద్దలు బాలికకు నష్టపరిహారాన్ని చెల్లించాలని తీర్మానించారు.

వీటన్నింటి నేపథ్యంలో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడిని అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.