కబుర్లు చెప్పుకుంటూ గడిపిన ప్రేమికులపై దాడి.. యువతిపై సామూహిక అత్యాచారం..

0
50
Ganagapraps
Ganagapraps

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. కఠినమైన శిక్షలు లేకపోవడం కారణంగా మహిళలపై ఎక్కడపడితే అక్కడ వయోబేధం లేకుండా అత్యాచారాలు, దాడులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మద్యం మత్తులో యువకులు రెచ్చిపోయారు. ప్రియుడి కళ్లెదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. కర్ణాటకలోని మైసూరులో ఈ ఘోరం జరిగింది.

నగరంలోని ఓ లాడ్జిలో పనిచేస్తున్న యువతి కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. బుధవారం వీరిద్దరూ కలిసి నగర శివారులోని లింగాంబుధి చెరువు వద్దకు వెళ్లి కబుర్లు చెప్పుకుంటున్నారు. వారిని చూసిన ఆరుగురు యువకులు వారి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారు. అంతేగాకుండా మద్యం మత్తులో వున్నారు. ఆపై యువకుడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు.

అనంతరం యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువతీయువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.