యువరత్న నందమూరి బాలకృష్ణ మరో కొత్త ప్రాజెక్టుపై దృష్టిసారించారు. తమిళ దర్శకుడు కేఎస్. రవికుమార్ – బాలయ్య కాంబినేషన్లో రానున్న రెండో చిత్రం ఇది. ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాను ఈ నెల 17వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ సినిమాకి ‘రూలర్’ అనే టైటిల్ను ఖరారు చేశారనే టాక్ ఫిల్మ్ నగరులో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇక బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ సినిమాలో కవల సోదరులుగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడని అంటున్నారు.
ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా హరిప్రియ పేరు బలంగా వినిపిస్తుండగా, మరో హీరోయిన్గా బాలీవుడ్ నటిని ఎంపిక చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక ప్రతినాయకుడిగా జగపతిబాబును తీసుకున్నారు. ‘లెజెండ్’ తర్వాత బాలకృష్ణ – జగపతిబాబు కాంబినేషనులో రూపొందుతోన్న సినిమా కావడంతో భారీ అంచనాలే ఉన్నాయి.