సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, 16వ తేదీ రాత్రి 10 గంటలకే ప్రచారాన్ని పరిమితం చేసింది. చివరి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన జరుగనుంది.
గురువారం రాత్రి 10 గంటల వరకు ప్రచార ముగింపు సమయంగా ప్రకటించింది. ఏడో దశలో బీహార్-8, జార్ఖండ్-3, మధ్యప్రదేశ్-8, పంజాబ్-13, ఛత్తీస్‌గడ్-1, ఉత్తరప్రదేశ్-13, హిమాచల్ ప్రదేశ్-4, పశ్చిమబెంగాల్-9 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
పశ్చిమబెంగాల్‌లో డుం డుం, బరసత్, బసిర్హత్, జైనగర్, మధురాపూర్, జాదవ్‌ఫూర్, డైమండ్ హార్బర్, సౌత్ కోల్‌కతా, నార్త్ కోల్‌కతా తొమ్మిది లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ. కాగా బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న వరుస వివాదాలపై ఎన్నికల సంఘం సీరియస్ అయింది. చివరిదశ పోలింగ్‌కు ఎల్లుండితో ప్రచార గడువు ముగియనుండగా.. పశ్చిమ బెంగాల్‌లో మాత్రం ఒకరోజు ముందే ఎన్నికల ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది.