తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఢిల్లీ భామ తాప్సీ. ఈమె సొట్టబుగ్గల సుందరిగా పేరుగాంచింది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు ఈమెను వెండితెరకు పరిచయం చేస్తే.. చివరకు ఆయనపైనే లేనిపోని కామెంట్స్ చేసి వివాదంలో చిక్కుకుంది.
ఈ క్రమంలో ఆమె తాజాగా నటించిన చిత్రం “గేమ్ ఓవర్”. ఇందులో తాప్సీ ప్రధానపాత్రను పోషించింది. వై నాట్ స్టూడియా నిర్మాణంలో సినిమా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 14వ తేదీన విడుదల కానుంది. అశ్విన్ శరవణన్ దర్శకుడు. ఈ సినిమా టీజర్ బుధవారం విడుదలైంది. టీజర్‌ను చాలా ఆసక్తికరంగా మలిచారు.
ఇందులో ఎక్కడా డైలాగ్స్ ఉండవు. టీజర్ అంతా బ్యాగ్రౌండ్ స్కోర్ మీదనే నడిచింది. తాప్సీ గేమింగ్ డిజైన్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాత్రలో కనిపించింది. “మనకు రెండు జీవితాలుంటాయి. రెండోది మొదలయ్యేసరికి ఒకటి మాత్రమే ఉందని మనకు అర్థమవుతుంది” అనే పాయింట్స్‌ను చెప్పే ప్రయత్నం చేశారు.
అదేసమయంలో ఎవరో తాప్సీని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారనేలా ఓ సీన్‌ను చూపించారు. నిజంగానే తాప్సీని ఎవరైనా చంపడానికి ప్రయత్నిస్తారా? లేదా? మరి తాప్సీ చంపేదెవరు? అనేది తెలుసుకోవాలంటే మాత్రం సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది.