మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంటే, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
వచ్చే అక్టోబరు నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే, ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇది 19వ శతాబ్దానికి చెందిన కథ కావడంతో నేరుగా కథలోకి వెళ్లకుండా, ‘బాహుబలి’తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన అనుష్క చేత “సైరా” కథ చెప్పించబోతున్నారట. “సైరా”లో నటించడం గురించి చాలా రోజులు ఆలోచించిన స్వీటి ఎట్టకేలకు ఓకే చెప్పిందట. ఈ ప్రత్యేక పాత్రలో నటించినందుకుగానూ అనుష్క భారీ రెమ్యునరేషన్ అందుకోబోతోందోట.
దేశవ్యాప్తంగా పరిచయం ఉన్న హీరోయిన్ కాబట్టి, అమె వల్ల సినిమాకు ఇతర భాషల్లోనూ డిమాండ్ పెరుగుతుందనే కారణంతో అనుష్క అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు నిర్మాత చెర్రీ అంగీకరించాడట. ఇదే నిజమైతే స్వీటీ పంటపండినట్టే.