హీరోయిన్ టబు.. తెలుగు తెరకు పరిచయం అవసరం లేని పేరు. ఆమె తెలుగులో తక్కువ సినిమాలే చేసినా అంతలా గుర్తింపు పొందారు. టాలీవుడ్ అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తో నటించింది. ముఖ్యంగా అక్కినేని నాగార్జునతో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది.
ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌కు అమ్మగా నటించనున్నారు. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “దేదే ప్యార్ దే” సినిమాలో టబు నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతోంది.
అయితే, ఈమెకు తెలుగు హీరోలతో ఉన్న ఎఫైర్ల కంటే బాలీవుడ్ హీరోలతోనే అధిక ఎఫైర్లు ఉన్నట్టు రుమార్లు వచ్చాయి. వీటిపై తాజాగా టబు స్పందించారు. “సల్మాన్, అజయ్ నాకు ముఖ్యమైన వ్యక్తులు. వాళ్లతో నా అనుబంధానికి పేరు పెట్టలేను. నా జీవితంలోని కఠిన పరిస్థితుల్లో వాళ్లతోనే కలిసి ఉన్నా. ఆ సమయంలో వాళ్లు నా వెన్ను తట్టి ప్రోత్సహించారు. వాళ్లు నా ఆప్తమిత్రులు. కుటుంబ సభ్యుల్లాగే భావిస్తా. అజయ్, సల్మాన్‌తో స్నేహం చేస్తే ఎవరూ అంత తేలిగ్గా వదులుకోరు” అంటూ వివరణ ఇచ్చింది.