బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎంత స్పీడ్‌గా ఉంటుందో.. లైఫ్‌లో తీసుకునే నిర్ణయాల విషయంలోనూ అదే స్పీడ్‌ను మెయింటైన్ చేస్తుంది.
వివాదాలు ఎదురైనప్పటికి వాటిని ఎదుర్కొని నిలబడి గెలవడం అలవాటు చేసుకుంది. తాజాగా, సోషల్ మీడియాలో ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలు ఫోటోలు పోస్ట్ చేస్తూ తానెంత ఫిట్‌గా ఉన్నానో ఫ్యాన్స్‌కు చెప్తుంటుంది మలైకా.
ప్రస్తుతం మాలైకా వయస్సు 45 సంవత్సరాలు. ఆమె ఫిట్నెస్ రహస్యం తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవుతారు. 30 సంవత్సరాలలోనే వయసు ఆగిపోయిందా అనే విధంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళినపుడు మలైకా వివిధ రకాల భంగిమల్లో యోగాసనాలు వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.
తాజాగా ముంబైలో ఓ ఫిట్నెస్ సెంటర్లో స్టీల్ బార్లపై ఆమె చేసిన ఫీట్ అందరిని ఆకట్టుకుంటుంది. మామూలు వ్యక్తులు ఆ ఫీట్ చేయాలంటే చాలా కష్టం. కానీ, మలైకా మాత్రం ఆ ఫీట్‌ను సునాయాసంగా చేసింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. లేటు వయుసులో ఘాటు ఫోటోలతో పిచ్చెక్కిస్తోంది..