విజయ్‌తో ప్రేమలో మునిగిపోయానా?: ఐశ్వర్యా రాజేశ్

0
58

ఐశ్వర్యా రాజేశ్. తమిళంలో వరుస ఆఫర్లు కొట్టేస్తూ ముందుకు సాగుతున్న హీరోయిన్. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువకాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అయితే, ఈమె టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండతో ప్రేమలో పడినట్టు వార్తలు వస్తున్నాయి.

ఐశ్వర్య, విజయ్ కలిసి చెట్టా పట్టలేసుకొని తిరుగుతున్నారని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలపై జాగా ఈ విషయంపై ఐశ్వర్య రాజేశ్ స్పందించారు. “నాకు ఒక ప్రేమకథ ఉందని, నేను ప్రేమలో ఉన్నాననే వార్తలను గత కొన్ని రోజులుగా వింటున్నాను.

నేను ఎవరితో ప్రేమలో పడ్డాననే విషయం తెలుసుకోవాలని ఉందంటూ ట్వీట్ చేసింది. నేను నిజంగానే ఎవరి నైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెపుతానని, అనవసరంగా పుకార్లను చేయకండని” ఆమె కోరారు. కాగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండతో ఐశ్వర్య రాజేశ్ ఒక సినిమా చేయనుంది.