కాజల్‌ను ఆటాడుకున్న తేజ.. నడుం విరిగిపోయిందట..

0
51

తెలుగు సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌ను డైరెక్టర్ తేజ వదిలిపెట్టేలా కనిపించడంలేదు. దర్శకుడుగా తాను విఫలమైనపుడల్లా తేజ… కాజల్‌ వెంటపడుతున్నాడు. నిజానికి ఈ అమ్మడును వెండితెరకు పరిచయం చేసింది కూడా ఈయనే. అందుకే తేజకు కాజల్ అన్నా.. కాజల్‌కు తేజ అన్నా ప్రత్యేక అభిమానం.

ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం సీత. ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలపై కాజల్ స్పందించింది. సీత సినిమా టైమ్‌లో తేజ తన నడుము విరగ్గొట్టేశాడని వెల్లడించింది. ఒక్కో సమయంలో ఆయన కొట్టుడును తట్టుకోలేక పోయేదాన్నని చెప్పింది.

‘తేజ మన పెర్ఫార్మెన్స్ చూడడు. మన కళ్లు చూస్తాడు. అందులో పెర్ఫార్మెన్స్ కనిపించాలంటాడు. ఏదైనా చేయండి నాకు మాత్రం కళ్లలో భావాలు కనిపించాలంటాడు. చాలా అలసిపోయాను. ఫిజియో థెరపీ కూడా చేయించుకున్నాను.. ఒక దశలో నా కాళ్లపై నేను నిలబడలేకపోయాడు. నా నడుము భాగానికి వేసిన ప్లాస్టర్లతోనే నేను నటించాను. సినిమాలో కూడా ఆ కట్లు కనిపిస్తాయి. ఆ సీన్ ఉంచారో లేక కట్ చేశారో నాకు తెలీదు’ అని కాజల్ చెప్పుకొచ్చింది.

ఇలా తేజ తనను హింసించిన విషయాన్ని బయటపెట్టింది కాజల్. అయినప్పటికీ అన్నీ భరించానని, ఎందుకంటే “సీత” సినిమాలో పాత్ర అంటే తనకు అంత ఇష్టమని అంటోంది. మరోవైపు తను నిర్మాతగా మారబోతున్న విషయాన్ని కూడా అధికారికంగా బయటపెట్టింది కాజల్.

కాగా, తాను అనుకున్న సీన్ పండేంత వరకు నటీనటులను తేజ హింసిస్తాడనే టాక్ ఉంది. అవసరమైతే కొడతాడని చెబుతుంటారు. ఇలా కొట్టించుకున్న జాబితాలో కాజల్ అగర్వాల్ కూడా చేరిపోయింది.\