రకుల్ ప్రీత్ సింగ్.. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ రంగమైనా దున్నేస్తోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసబెట్టి సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం “దే దే ప్యార్ దే” చిత్రం ఘన విజయం సాధించింది. ఈ చిత్రం వసూళ్ళ పరంగా కనకవర్షం కురిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైవిధ్యమైన వంటకాల రుచుల్ని తాను ఆస్వాదిస్తానని, రుచికరమైన ఆహారమంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చింది. అదేసమయంలో తాను ఫిట్‌గా ఉండేందుకు ప్రతిరోజూ గంటపాటు వ్యాయామం చేస్తానని, అదే తన బ్యూటీ రహస్యమని వెల్లడించింది.
ఇకపోతే, దే దే ప్యార్ దే చిత్రానికి లభిస్తున్న ఆదరణ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసింది. పనిలో పనిగా రణ్వీర్ సింగ్ ప్రస్తావన తీసుకొచ్చింది. ఆయనంటే తనకి ఎంతో ఇష్టమనీ, ఆయన ఎనర్జీ ఒక రేంజ్లో ఉంటుందని అంది. రణ్వీర్ సింగ్‌కి పెళ్లి కాకుండా ఉంటే తాను చేసుకుని ఉండేదానినని చెప్పింది.