నవ్యాంధ్రకు పట్టిన చంద్రదోషం పోయిందనీ, రామరాజ్యం ప్రారంభమైందని తితిదే మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. తాజాగా ఎన్నికల్లో వైకాపా విజయభేరీ మోగించడంపై స్పందిస్తూ, ఏపీలో రాక్షస పాలన అంతమైందన్నారు. రాష్ట్రానికి పట్టిన పీడ విరగడైందని, చంద్రదోషం పోయిందన్నారు. ఇకపై రామరాజ్య పాలన సాగుతుందన్నారు.
అంతేకాకుండా, టీడీపీ అధికారంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడ్డారన్నారు. ముఖ్యంగా తితిదేలో వంశపారంపర్య అర్చకత్వం హక్కును తెదేపా సర్కారు కాలరాసిందన్నారు. దీన్ని వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సర్కారు తిరిగి పునరుద్ధరించాలని ఆయన కోరారు.
జగన్ మోహన్ రెడ్డి వారి తండ్రి వైఎస్ఆర్‌లా మంచి సుపరిపాలన అందిస్తూ, సుధీర్ఘకాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. అంతేకాకుండా, గత కొంతకాలంగా స్వామివారి కైంకర్యాలకు తాను దూరంగా ఉన్నానని, జగన్ తిరిగి తనకు స్వామికి సేవలు చేసుకునే భాగ్యం కల్పించాలని ఆయన కోరారు.