వేసవికాలంలో పుచ్చకాయలు విరివిగా లభిస్తుంటాయి. అయితే, ఈ కాయలు ఆరగించేటపుడు లోపలి వుండే ఎర్రటి గుజ్జును మాత్రమే తిని, వాటిలోని విత్తనాలను పారేస్తుంటారు. నిజానికి ఎర్రటి గుజ్జులో కంటే పుచ్చకాయ విత్తనాల్లోనే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.
పుచ్చకాయ విత్తనాల్లో ఉండే జింక్, మాంగనీస్‌లు పురుషుల్లో సంతానసాఫల్యతని పెంచుతాయి. వీటిలోని ప్రోటిన్లు కండరాలూ, కణజాలాల పెరుగుదలకి అలాగే చర్మ సౌందర్యానికి తోడ్పడుతాయి.
ముఖ్యంగా, ఇందులోని మెగ్నీషియం అలర్జీలు రాకుండా చూడటంతో పాటు వృద్ధాప్యాన్నీ అడ్డుకుంటుంది. గుండెను కాపాడే మోనో, పాలీఅన్‌శాచురేటెడ్, ఒమేగా ఆమ్లాలన్నీ ఈ విత్తనాల్లో పుష్కలంగా ఉన్నాయి.
వీటిలోని ఫోలెట్ గర్భిణులకి ఎంతో మంచిది. అలాగే, గింజల్లో ఉండే ఆర్జనైన్ అనే పోట్రిన్ వలన బీపినీ, హృద్రోగాలనీ నియంత్రంచే శక్తి ఉంటుంది.