బిగ్‌బాగ్-3లో రష్మీ – సుధీర్‌?

0
52

బుల్లితెర యాంకర్ రష్మీ గౌతం. ‘జబర్దస్త్’ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్. రష్మీ – సుడిగాలి సుధీర్ మధ్య ప్రేమబంధం ఉందన్నది బహిరంగ రహస్యం. కానీ, వీరిద్దరూ దీనిప ఏనాడూ బయపడలేదు. అయితే, నెటిజన్లు మాత్రం వీరిద్దరి గురించి తమకుతోచిన విధంగా కామెంట్స్ చేస్తుంటారు. పైగా, బుల్లితెరపై వీరిద్దరూ కలిసి చేసే కార్యక్రమాలు సైతం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటాయి. వీటికి టీఆర్పీ రేటింగ్స్ కూడా తారాస్థాయిలో ఉంటుంది. అదేసమయంలో వీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. అందువల్ల ఖచ్చితంగా వీరిద్దరూ ప్రేమికులేనంటూ నెటిజన్లు చెప్పుకుంటుంటారు.

ఈ క్రమంలో త్వరలో “బిగ్‌బాస్-3” రియాల్టీ షో ప్రారంభంకానుంది. ఈ షోకు మరింత క్రేజ్ తెచ్చేందుకు వీలుగా రష్మీ – సుధీర్‌లను షో నిర్వాహకులు సంప్రదిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరినీ ఎలాగైనా ఒప్పించి ఈ షోలో పార్టిసిపేట్ చేసేలా కృషి చేస్తున్నారు. వీరిద్దరూ కాని సమ్మతిస్తే.. ఖచ్చితంగా ఆ షోకి మంచి ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తారని భావిస్తున్నారు.

అయితే, వీరిద్దరూ తమతమ కార్యక్రమాలతో చాలా బిజీగా ఉన్నారు. అందువల్ల బిగ్‌బాస్ షోకు అంగీకరించక పోవచ్చనే కథనాలు వినిపిస్తున్నాయి. కానీ, భారీ రెమ్యునరేషన్ చెల్లిస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ చెప్పొచ్చని మరికొందరు అంటున్నారు.

ఏదిఏమైనా.. ఈ రియాల్టీ షోకు వారిద్దరూ అంగీకరిస్తే మాత్రం ఖచ్చితంగా వారిద్దరూ ప్రేమలోపడి పెళ్లి చేసుకోవడం ఖాయమనే నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే గతంలో అనేక నటీనటులు ఈ షోలో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత పెళ్ళి చేసుకున్న సంఘటనలు లేకపోలేదు.