గుంటూరు జిల్లాలో బీజేపీ నిర్వహించిన ప్రజా చైతన్య సభలో ప్రధాన మంత్రి పాల్గొన్న నేపథ్యంలో.. గుంటూరులో ‘ప్రధాని మోదీ-వైసీపీ అధినేత జగన్-గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని’ ఫొటోలతో పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ పోస్టర్లో నాని.. మోదీని ఆహ్వానించినట్లు వుండటంతో నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా నాని గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ పనికి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
ట్విట్టర్‌లో నాని స్పందిస్తూ..”పచ్చ పకోడీగాళ్ళారా.. దమ్ముంటే నా దగ్గరికి రండి, సమాధానం చెప్తా. ఇలా మీకు మీరే జగనన్న ఫొటో, నా ఫొటో పెట్టి బ్యానర్లు వేసుకుని శునకానందం పొందడం ఏందిరా సుంటల్లారా. నాలుగేళ్ళు మోడీ సంకనాకింది ఎవరు? నాలుగేళ్ళు కాపురం చేసింది మీరు, మేం కాదు. మోడీ అయినా, చంద్రబాబు లాంటి కేడీ అయినా మాకు ఒక్కటే” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.