అధికారం జగన్‌కు శాశ్వతం కాదు : చంద్రబాబు

0
51
chandrababu - devansh
chandrababu - devansh

తెలుగుదేశం పార్టీ ఓటమికి గల కారణాలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమీక్ష చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కార్యకర్తలంతా ఐక్యంగా, ఆత్మస్థైర్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, అధికారం ఎపుడూ కూడా ఒకరి చేతుల్లోనే ఉండదన్నారు. పైగా, జగన్‌కు అధికారం శాశ్వతం కాదన్నారు.

తెలుగుదేశం పార్టీకి ఆటుపోట్లు కొత్తేమి కాదని, ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయంతో ముందుకుసాగాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా, కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రజల్లో ఉండాలని చంద్రబాబు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాగా, సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోయిన విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో టీడీపీకి 23 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ సీట్లు రాగా, వైకాపాకు 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు, జనసేన పార్టీకి ఒక్క అసెంబ్లీ సీటు వచ్చింది.