కుబేరుడికి నచ్చిన శంఖు ముద్ర.. గొంతు సమస్యలు ఇక వుండవు.

0
122

కుబేరుడు ఉత్తర దిక్కుకు అధిపతి. కుబేరునికి ప్రీతిపాత్రమైన రోజు గురువారం. ముఖ్యంగా పునర్వసు నక్షత్రంతో కూడిన గురువారం అంటే కుబేరునికి చాలా విశేషమైన రోజు. ఆ రోజున కుబేరుడిని పూజ చేస్తే.. సిరిసంపదలు వెల్లివిరుస్తాయని పండితులు చెప్తున్నారు. అలాగే కుబేరునికి శంఖువు అంటే మహా ప్రీతి. అందుకే శంఖు ముద్రను రోజూ పది నుంచి 20 నిమిషాలు వేసేవారికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు.

ఫలితాలు.. థైరాయిడ్‌ను దూరం చేసుకోవచ్చు. గొంతు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. వాక్చాతుర్యత పెరుగుతుంది. నత్తిని నిరోధించవచ్చు. ఈ ముద్ర ద్వారా బొడ్డుకు కింద నున్న 72000 నరాలను అనుసంధానం చేసే శక్తిని కలిగివుంటుంది. ఆకలిలేమిని నయం చేస్తుంది.

శరీరంలోని ఉష్ణాన్ని తగ్గిస్తుంది. జ్వరం, అలర్జీలు, చర్మ సమస్యలను నివారించే సత్తా ఈ ముద్రకు వుంది. మానసిక ప్రశాంతత నెలకొంటుంది. ధ్యానం చేస్తూ ఈ ముద్రను వేయడం ద్వారా విశేష ఫలితాలుంటాయి. రోజుకు 20 నిమిషాల పాటు రెండుసార్లు ఈ ముద్రను వేయాలని పండితులు చెప్తున్నారు.

ఎలా చేయాలంటే..? ఎడమచేతి బొటనవేలును చిత్రంలో చూపెట్టినట్లు కుడిచేతితో పట్టుకోవాలి. శంఖువును పోలినట్లు చేతిని వుంచడం ద్వారానే దీన్ని శంఖుముద్ర అంటారు.