సల్లూభాయ్ ఫిట్నెస్ సీక్రెట్స్ తెలుసుకున్న చెర్రీ భార్య

0
70

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. నాలుగు పదుల వయసులోనూ ఎంతో ఫిట్‌గా ఉంటాడు. పైగా, బాలీవుడ్‌లో ముదురు బ్యాచిలర్ హీరో. ఈయన్ను టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా ఇంటర్వ్యూ చేసి, సల్లూభాయ్ ఫిట్నెస్ రహస్యాలను తెలుసుకుంది.

అపోలో గ్రూపునకు చెందిన మ్యాగజైన్ “బి పాజిటివ్”. ఇందులో ప్రముఖుల ఆరోగ్య రహస్యాలు, వారు తీసుకునే ఆహారం, ఫిట్నెస్ కోసం వారు తీసుకునే జాగ్రత్తలు తదితర వివరాలను ప్రచురిస్తుంటారు.

తాజాగా, ఈ మ్యాగజైన్ కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను ఎంపిక చేసుకోగా, ఆయన్ను ఉపాసన ఇంటర్వ్యూ చేశారు. ఈ మ్యాగజైన్ వ్యవహారాలను ఆమె పర్యవేక్షిస్తోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా తెలిపారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోతో పాటు ఓ ట్వీట్ చేశారు. సల్మాన్ భాయ్ లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నామని చెప్పిన ఉపాసన, కండలవీరుడికి “థ్యాంక్స్” చెప్పారు.