కంటికి కాదు.. ఆత్మకు అందంగా కనిపించాలి…

0
42

బాలీవుడ్ కుర్రకారు నటి సారా ఆలీఖాన్. ఆమె “బజార్” అనే మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది. ఈ మ్యాగజైన్ కవర్ పేజీలో ప్రచురితమైన ఫోటో చూస్తుంటే కుర్రకారుకు పిచ్చెక్కిపోతోంది.

బ్లూ వైట్ కలర్‌లో ఉన్న టాప్ ధరించి, లైట్ గ్రీన్ కలర్‌లో పఫ్‌లాగా ఉన్న లెహెంగా వేసుకుని ఒక సోఫాపై కూర్చొని కిరాక్ ఫోజు ఇస్తోంది. ఈ ఫోటోకు సారా ఇచ్చిన క్యాప్షన్ “కంటికి అందంగా కనిపించడం కాదు. ఆత్మకు అందంగా కనిపించాలి” అంటూ క్యాప్షన్ పెట్టింది.

ఈ ఫోటో షూట్ కోసం ఆమె చేతికి వాచ్ ధరించింది. చేతుల నిండా గాజులు వేసుకుంది. మెడలో మాత్రం ఎలాంటి ఆభరణాలు ధరించలేదు. కానీ, చెవులకు మాత్రం అందమైన రింగులు పెట్టుకుంది. ఆమెను అలా ఎవరు తీర్చిదిద్దారోకానీ.. ఓ దేవకన్యలా మార్చేశారు. పైగా, ఆ లిప్ స్టిక్.. ఐ మేకప్ అదిరిపోయింది.

ఫోటో అంతా అందాలే అందాలు. సారా మేని రంగు.. కాళ్లు.. చేతులు.. ఫేస్‌లో ఉన్న గ్లో.. హెయిర్ స్టైల్ అన్నీ పర్ఫెక్ట్. ఈ ఫోటోను పోస్ట్ చేసిన ఐదు గంటల్లోనే 1.3 మిలియన్ లైక్స్ వచ్చాయంటే ఆమె ఎంత అందంగా కనిపిస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఇక నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ అన్నీఇన్నీకావు. ‘ప్రెట్టినెస్ కేరాఫ్ సారా’.. ‘లాలీ పాప్ లాగా ఉన్నావు’..’మాషా అల్లా.. నషా చడ్ గయి’.. ‘అవసరానికంటే ఎక్కువ అందంగా ఉన్నావు’ అంటూ కామెంట్స్‌ను పోస్ట్ చేస్తున్నారు.