పడకగదిలో టీవీలు పెట్టుకున్నారనుకోండి.. ఇక అంతే సంగతులు అంటున్నారు.. ఫెంగ్‌షుయ్ నిపుణులు. పడకగదిలో కంప్యూటర్లు, టీవీల వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు చోటు ఇవ్వకూడదు. ఇంకా పడకగదిని సానుకూల శక్తి ప్రవహించేలా సర్దుకోవాలని ఫెంగ్‌షుయ్ చెబుతోంది. పడకగది చక్కగా విశ్రాంతి పొందేందుకు వీలుగా ఏర్పాటు చేసుకోవాలి. ఏ దిక్కు నుంచీ కూడా మీరు పడుకునే మంచం ప్రతిబింబించేలా గదిలో అద్దాన్ని పెట్టుకోరాదు.
అలాగే పడకగదిలో టివి పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఇది కూడా అద్దం లాగే ప్రతికూల వస్తువు. అద్దం వెబ్రేషన్‌తో దుష్ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. మంచాన్ని కిటికీకి కిందా తలుపుకు ఎదురుగా ఉండకుండా చూసుకోవాలి. మూడు వైపుల నుంచి దిగేందుకు వీలుగా మంచాన్ని వేసుకోవాలి.
పడకగదికి బాత్‌రూమ్ అటాచ్డ్‌గా ఉంటే ఎప్పుడూ దాని తలుపు మూసే ఉంచాలి. పడకగదిలో మొక్కలు, అక్వేరియం పెట్టుకోవడం మంచిది కాదు. ఎదిగే మొక్కలు, చురుకుగా తిరిగే చేపలు బెడ్‌రూంలో విశ్రాంతి వాతావరణంతో విబేధిస్తాయి.