నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారు నాగారంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో పడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. నాగారం ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన వీరు. నమాజ్ కోసం శుక్రవారం మధ్యాహ్నం బయటకు వచ్చారు.ఈ క్రమంలో ప్రభుత్వ క్రీడా మైదానం పక్కనే ఉన్న నీటి కుంటలో ప్రమాదవశాత్తు పడి చనిపోయి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ఒకరు మూడో తరగతి విద్యార్థికాగా, మరో ఇద్దరు నాల్గోతరగతి చదువుతున్నారు. పాఠశాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రాకపోవడంతో ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారంతా సాయంత్రం వరకు వెతికినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఐదో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం కాస్తా చీకటి పడిన తర్వాత కాల్వలో ఓ విద్యార్థి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మరో రెండు మృతదేహాలు ఇవాళ ఉదయం బయటపడ్డాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -