మళ్లీ వర్షం పడే అవకాశం ప్రపంచ కప్‌ సెమీస్‌ మ్యాచ్‌?

0
49

మాంచెస్టర్‌: న్యూజిలాండ్‌- ఇండియాల మధ్య రసవత్తరంగా సాగుతున్న ప్రపంచ కప్‌ సెమీస్‌ మ్యాచ్‌ను వరుణుడు పలకరించిన విషయం తెలిసిందే. వర్షం తీవ్రత ఎక్కువ కావడంతో నిబంధనల ప్రకారం మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. తర్వాత వరుణుడు కరుణించకపోవడంతో మ్యాచ్‌ను బుధవారానికి మార్చారు. ఈ రోజు మధ్యాహ్నం తిరిగి 46.1 ఓవర్ల నుంచి మ్యాచ్‌ మొదలు కానుంది. అయితే, ఈ రోజు కూడా మాంచెస్టర్‌లో వర్షం కురిసే అవకాశమున్నట్లు అక్కడి వాతావరణశాఖ తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30గంటలు) వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత గంట సేపటికి వర్షం ప్రభావం తగ్గినా.. ఆకాశం మాత్రం మేఘావృతమై ఉండవచ్చని సమాచారం. ఇక మళ్లీ సాయంత్రం 5గంటలకు(ఇక్కడ రాత్రి 9:30గంటలు) చినుకులు  పలకరించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అంటే మ్యాచ్‌ దాదాపు ముగింపు దశకొచ్చే సమయానికి వరుణుడు మళ్లీ పలకరిస్తాడన్నమాట. ఈ నేపథ్యంలో టీమిండియాకు పెద్ద సవాలే ఎదురుకానుంది. కివీస్‌ బౌలర్లు లాకీ ఫెర్గూసన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌ ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటారని విశ్లేషకులు తెలుపుతున్నారు.