నేడు రథసప్తమి..ఈరోజు ఇలా చేస్తే అన్నీశుభాలే

0
64

రథసప్తమి: 12 ఫిబ్రవరి 2019, మంగళవారం, మాఘ శుద్ధ సప్తమి. మకరసంక్రమణం రోజున సూర్యుడు ఉత్తరానికి తిరుగుతాడు. ఆ ఉత్తరపు నడక ఈరోజు నుంచి సరియైన దిశలో సాగుతుంది. సూర్యుడి రథసారథి అయిన అరుణుడు రథాన్ని ఈరోజు నుండి ఈశాన్య దిక్కువైపు పోనిస్తాడు. ఈ ఒక్కరోజే కాకుండా ఈ మాసములో వచ్చే అన్ని ఆదివారములలోను సూర్యుడికి విశేష ఆరాధన జరుగుతుంది.

రథ సప్తమినాడు ఆవు నేతితో దీపారాధన చేయడం శ్రేయస్కరం. రథసప్తమి రోజు సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసికోట పక్కగా ఆవు పేడతో అలికి, దానిపై పిండితో పద్మం వేసి, పొయ్యి పెట్టి పిడకలు అంటించి, పాలు పొంగించి, ఆ పాలల్లో కొత్తబియ్యం, బెల్లం, నెయ్యి, ఏలకులు వేసి పరమాన్నం తయారు చేస్తారు.

తులసికోట ఎదురుగా చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడాకులపై పరమాన్నం ఉంచి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది. చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయి.