వరంగల్: విద్యుత్ ప్రసారం ఉంటేనే బల్బు వెలుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ.. అందుకు భిన్నంగా మనిషి చేయిని తాకినప్పుడు బల్బు వెలిగితే..! ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ.. ఇది నిజమే. ఇలాంటి అరుదైన, ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని కన్నారావుపేటలో జరిగింది. గ్రామానికి చెందిన శంకరాచారి అనే వ్యక్తి నర్సంపేట పట్టణంలో విద్యుత్ ఛార్జింగ్ బల్బును కొన్నాడు. తన గ్రామానికి వెళ్లిన తర్వాత కొందరు స్నేహితులు కలవడంతో తాను విద్యుత్ ఛార్జింగ్ బల్బు కొనుగోలు చేసిన విషయాన్ని వారితో చెప్పాడు. వారు ఆసక్తితో విద్యుత్ ఛార్జింగ్ బల్బును చూసే క్రమంలో అనుకోకుండా అది శరీరానికి తాకడంతో ఒక్కసారిగా వెలిగింది. దీంతో వారు షాక్ అయ్యారు. మరోసారి బల్బును పరీక్షించగా.. మళ్లీ అది వెలిగింది. అక్కడ ఉన్న స్నేహితులంతా ఒక్కొక్కసారిగా పరిశీలించగా.. కొంతమంది శరీరాన్ని తాకినప్పుడు వెలిగిన బల్బు.. మరికొంతమందిని తాకితే మాత్రం వెలగలేదు. దీంతో గ్రామస్థులు సంభ్రమాశ్చర్యానికి గురవుతున్నారు. ఆ బల్బు విద్యుత్ లేకుండా ఎలా వెలుగుతుందో అవగాహన కల్పించాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -