రావల్పిండి: పాకిస్థాన్‌లో ఓ సైనిక శిక్షణ విమానం కుప్పకూలింది. రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పైలట్లు సహా 17మంది మృతి చెంచారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12 మంది పౌరులు ఉన్నారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గాయపడ్డవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. శిక్షణలో భాగంగా చక్కర్లు కొడుతున్న సమయంలో ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయిన విమానం రావల్పిండి నగర శివారులోని నివాససముదాయాల్లో కుప్పకూలింది. ప్రమాదానికి ముందు కంట్రోల్ విభాగంతో సంబంధాలు తెగిపోయాయని.. అసలు కారణాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో ఇంకా మంటలు చెలరేగుతుండడంతో సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -