ప్రజాగాయని విమలక్క అరెస్ట్..

0
100

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన సి పి ఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ అజ్ఞాత దళ నాయకుడు లింగన్న మృతదేహాన్ని చూసేందుకు గాంధీ హాస్పిటల్ కి వెళ్ళిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్పర్సన్ ప్రజాగాయని విమలక్కను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. అంతకుముందే అక్కడికి చేరుకున్న ఐఎఫ్టియు జాతీయ ప్రధాన కార్యదర్శి బూర్గుల ప్రదీప్ , ఐఎఫ్టియు రాష్ట్ర నాయకురాలు అరుణ ల తో పాటు భారీ సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకున్న ప్రజా సంఘాల కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు వారిని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
కామ్రేడ్ లింగన్న ఎన్కౌంటర్ లో పాల్గొన్న పోలీసు అధికారులపై కేసులు నమోదుచేసి, ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. నిరసన తెలిపే కనీస స్వేచ్ఛను కాలరాస్తున్న ప్రభుత్వం వైఖరిని ఖండిస్తూ, ఈరోజు హైదరాబాద్లో అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులు అందర్నీ బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
విప్లవవాభివందనాలతో
మోహన్ బైరాగి, మల్సూర్ (అరుణోదయ)
కుమార్, మల్లేష్ (ఏ ఐఎఫ్టియు)
పద్మ అనిత పీవోడబ్ల్యూ (స్త్రీ విముక్తి)
నాగరాజు ,ఆనంద్ ( p d s u)
నాగిరెడ్డి, కొమరన్న (రైతు కూలి పోరాట సమితి)