ఇటీవల కన్నుమూసిన మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్ ఘనంగా నివాళులు అర్పించారు. వెయ్యి నేతి దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజు ఆదేశాల మేరకు సిమ్తోఖా జొంగ్‌లో ప్రత్యేక పూజలు జరిగాయి. సుష్మ కుటుంబ సభ్యులతో పాటు, భారత ప్రభుత్వానికి భూటాన్ రాజు ఇప్పటికే తన సంతాప సందేశాన్ని పంపించారు.
కాగా సుష్మా స్వరాజ్ మరణం కేవలం బీజేపీ పార్టీకి మాత్రమే కాదనీ.. యావత్‌దేశానికే తీరని లోటు అని భూటాన్ ప్రధాని లోటే త్సెరింగ్ పేర్కొన్నారు. ‘‘భూటాన్‌కు ఆమె మంచి స్నేహితురాలు. భూటాన్, భారత్ సంబంధాల బలోపేతానికి ఆమె విశేష కృషి చేశారు..’’ అని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు భారత విదేశాంగ మంత్రిగా కొనసాగిన సుష్మా… భూటాన్‌తో అత్యంత స్నేహపూర్వకంగా పనిచేశారు. మంగళవారం రాత్రి గుండెపోటు కారణంగా సుష్మా స్వరాజ్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే.