దేశ 73వ స్వాతంత్ర్య దినోత్సవ శుభ వేళ భారత వైమానిక దళ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు భారత ప్రభుత్వం ‘వీరచక్ర’ పురస్కారం ప్రదానం చేయనుంది. గురువారంనాడు ‘వీర చక్ర’ పురస్కారాన్ని అభినందన్ అందుకోనున్నారు. గత ఫిబ్రవరి 26న తాను ప్రయాణిస్తున్నమిగ్ విమానంతో అభినందన్ కూల్చివేశారు. ఆ తర్వాత తన మిగ్ కూడా కూలిపోవడంతో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దిగాడు. స్థానికులు ఆయన్ను పట్టుకుని పాక్ సైన్యానికి అప్పగించారు. వారు ఎంత ఒత్తిడి చేసినా మిలిటరీకి సంబంధించిన ఎలాంటి సున్నిత సమాచారాన్ని ఆయన బయటపెట్టలేదు. తర్వాత భారత్ సహా ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయడంతో పాకిస్థాన్ ప్రభుత్వం వర్థమాన్‌ను వాఘా సరిహద్దు వద్ద అప్పగించింది. అభినందన్ చూపించిన సాహసం ఒక్కసారిగా ఆయనను రియల్ హీరోను చేసింది. సాహసానికి ప్రతీకగా, భారత్‌కు ఓ బ్రాండ్‌గా ఆయన పేరు మారుమోగింది. అభినందన్‌కు భారత అత్యున్నత అవార్డైన వీర చక్ర ఇవ్వాలని కోరుతూ భారత వాయుసేన నామినేట్ చేసింది. కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తమిళనాడు సీఎం సైతం పళనిస్వామి సైతం ఆయన పేరును కేంద్రానికి సిఫారసు చేశారు. ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకు గాను ‘వీర్ చక్ర’ పురస్కారం ఆయనను వరించింది. సైన్యానికి పరమ్ వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -