సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ పేరిట నటీమణులను నమ్మించి వంచిస్తున్నారంటూ పలువురు నటీమణులు ఆరోపిస్తుండటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సినీ ప్రయాణం ఆరంభంలో తాను కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నట్లు ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్ తెలిపారు. ఇటీవల ఆమె నటించిన మిషన్ మంగళ్ సినిమా విజయవంతమైన సందర్భంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సినీ కెరీర్ ప్రారంభంలో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకుడు తనను రూమ్‌కి రమ్మన్నాడని ఆమె తెలిపారు. అంతేకాకుండా మరొక నిర్మాత తనను చూసి నీది హీరోయిన్ ముఖమేనా అని అన్నారని ఆనాటి చేదు అనుభవాలను గుర్తుతెచ్చుకున్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -