పీవీ సింధు…భారత క్రీడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించి..నాలుగు దశాబ్దాల కలను సాకారం చేసిన ఈ క్రీడాకారిణి ఇప్పుడు భారత్‌లో అత్యంత విలువైన మహిళా ప్లేయర్‌గా నిలుస్తోంది. బ్రాండ్‌లకే బ్రాండ్‌గా మారింది. అటు క్రీడలోనే కాకుండా.. ఇటు పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన పీవీ సింధు ‘బ్రాండ్ వాల్యూ’ ఇప్పుడు మరింత పెరిగింది. ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం ఆమె ప్రపంచంలోనే 7వ స్థానంలో నిలిచింది.
క్రికెట్ దిగ్గజం సచిన్‌టెండుల్కర్, ఎం.ఎస్.ధోనీలు ఒకప్పుడు అత్యధిక సంపాదన కలిగిన వారని ఫోర్బ్స్‌ని ప్రకటించిన విషయం విదితమే. ప్రస్తుతం పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ తను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థల నుంచి రోజు వారి ఆదాయం రూ.2 కోట్లు సంపాదిస్తున్నాడు. దేశంలో కోహ్లీనే అగ్రస్థానంలో ఉండటం విశేషం. ఇప్పుడు ఆయన తర్వాత స్థానంలో రోజుకు దాదాపు రూ.1.50 కోటి తీసుకుంటూ ద్వితీయ స్థానంలో నిలిచింది సింధు.